ప్రియునితో భార్య పరార్‌.. కూతుళ్లను చంపిన తండ్రి 

1 Jul, 2022 07:16 IST|Sakshi

యశవంతపుర: భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఉన్మాదిగా మారిన భర్త ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేశాడు. ఈ ఘటన కలబురిగిలో జరిగింది. వివరాలు... భోవి నగరకు చెందిన లక్ష్మికాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల ప్రియునితో కలిసి పరారైంది. దీంతో లక్ష్మికాంత్‌ నలుగురు పిల్లలను అవ్వ వద్ద ఉంచాడు.

బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కుర్చోపెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.   

(చదవండి: టీచర్‌ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి..)

మరిన్ని వార్తలు