ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని..

3 Jul, 2023 10:22 IST|Sakshi

గర్ల్‌ఫ్రెండ్‌ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ..
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్‌ ఖీరీ జిల్లాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కును తెగ్గోశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతనిని వెదికి పట్టుకున్నారు. బాంస్తాలీ గ్రామానికి చెందిన విక్రమ్‌కు కొన్నేళ్ల క్రితం మొహమ్మదాబాద్‌ గ్రామానికి చెందిన సీమాదేవితో వివాహం జరిగింది. తరువాత వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే ఇంతలో విక్రమ్‌.. గ్రామానికి మరో యువతితో అఫైర్‌ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీమ భర్తతో గొడవపడుతుండేది.

రాత్రి భోజనాలయ్యాక..
ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి భోజనాలయ్యాక భార్యాభర్తల మధ్య ఆ యువతితో అఫైర్‌ విషయమై వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్‌ ఆ  కోపాన్ని తన కుమార్తెపై చూపించాడు. దీనిని భార్య అడ్డుకుంది. దీంతో విక్రమ్‌ ఒక పదునైన ఆయుధంతో సీమ ముక్కును తెగ్గోశాడు. దానిని జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 

రక్తమోడుతున్న స్థితిలో..
వెంటనే ఆమె అదే స్థితిలోనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు నిందితుడు విక్రమ్‌ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి నిందితుడిని జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్‌ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే..

మరిన్ని వార్తలు