నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది

27 Sep, 2022 21:27 IST|Sakshi

రాయ్‌గఢ్‌: భార్యను పదే పదే నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ వేధించాడో భర్త. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈసారి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అదే కసితో భర్తని ఒక్కవేటుతో గొడ్డలితో నరికి చంపింది. అంతేకాదు అతని మర్మాంగాలను సైతం ఛిద్రం చేసి.. ఆపై నేరం నుంచి తప్పించుకునే యత్నం చేసింది.

ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా అమలేశ్వర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగీతకు, అనంత్‌ సోన్వానికి చాలాకాలం కిందట పెళ్లైంది. సంగీత.. అనంత్‌కు రెండో భార్య. అనంత్‌ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి సంతానంతో కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్‌.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. 

పెళ్లైన నాటి నుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ.. అసహ్యంగా ఉన్నావంటూ వేధించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గతంలో చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఆదివారం రాత్రి కూడా అలాగే గొడవ జరగ్గా.. ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా భర్త మర్మాంగాలను గొడ్డలితో నరికి.. ముక్కలు చేసింది. భర్త శవం పక్కనే రాత్రంతా పడుకుని పోయిందామె. అయితే.. ఉదయం కాగానే భర్తని ఎవరో చంపారంటూ అరవడం ప్రారంభించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించే సరికి సంగీత నేరం ఒప్పుకుంది.

ఇదీ చదవండి: ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్‌ షేక్‌

మరిన్ని వార్తలు