మటన్‌ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..!

3 Dec, 2021 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మనం సినిమాల్లో, రియల్‌ లైఫ్‌లో ఎన్నో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది.. వాటన్నింటికి మించింది. సవాల్‌ చేస్తున్నాం.. మీరు ఇంతవరకు ఇలాంటి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని ప్రపంచలో ఎక్కడా చూసుండరు. ఆ లవ్‌స్టోరీని మీరు చదవండి..

100 శాతం శాఖాహారి అయిన ఓ వ్యక్తికి.. అద్భుతమైన సౌందర్యరాశితో వివాహం అవుతుంది. ఆమెది కూడా ప్యూర్‌ వెజిటేరియన్‌ కుటుంబం. శాఖాహార కుటుంబంలో జన్మించిన ఆమె అనుకోకుండా ఒకసారి మటన్‌ తిన్నది. ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌ అయిపోయింది. ఇంట్లో తెలియకుండా బయట అడపాదడపా మటన్‌ తింటుండేది. 
(చదవండి: మాట తప్పావంటూ ట్రోలింగ్‌.. కోహ్లి కౌంటర్‌)

అయితే దీని గురించి ఆమె వివాహానికి ముందే అనగా పెళ్లి చూపుల సమయంలోనే భర్తతో చెప్పింది. మటన్‌ అంటే చాలా ఇష్టం అని.. ఇంట్లో వారికి తెలియకుండా బయట తింటుంటానని భర్తకు తెలిపింది. అపూరూప సౌందర్యరాశిని ఇలాంటి కారణం వల్ల వదులుకోవడం ఇష్టం లేని వ్యక్తి.. ఓ కండిషన్‌ పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందేంటంటే.. వివాహం తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు మటన్‌ తినకూడదని షరతు పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించడంతో వారి వివాహం జరిగింది.

కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగా సాగింది. అయితే సదరు మహిళ భర్తకు ఇచ్చిన మాటను నిలపుకోలేకపోయింది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె భర్తకు తెలియకుండా బయట మటన్‌ తినసాగింది. దీని గురించి కొన్ని రోజుల తర్వాత భర్తకు తెలిసింది. మాట తప్పిన భార్య మీద అతడికి చాలా కోపం వచ్చింది. అలా అని చెప్పి ఆమెను వదులుకోలేడు. అందుకని భార్యకు చివరి వార్నింగ్‌ ఇచ్చాడు. ‘నీకు మటన్‌ కావాలో.. భర్త కావాలో తేల్చుకో’ అని అల్టిమేటం జారీ చేశాడు.
(చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్‌ మంచిదేనా?)

అప్పటి వరకు బాగానే ఉంది కానీ.. ఆ తర్వాతే సదరు వ్యక్తికి ఓ అనుమానం వచ్చింది. కొంపదీసి భార్య.. తన బదులు మటన్‌ కావాలని కోరుకుంటే.. తన పరువు ఏం కావాలి అని ఆలోచించాడు.. ఇంతకు తన భార్య ఎవరిని ఎంచుకుంటందో అని ఆలోచించసాగాడు. ఈ క్రమంలో తన సమస్యను వివరిస్తూ.. ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లెటర్‌ రాశాడు. 

కౌన్సిలర్‌ అతడికి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.. ‘‘శుభాకాంక్షలు. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీల్లో మీరు మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇక్కడ ఓ అమ్మాయి మనిషి, మేకల మధ్య తనకు ఎవరు కావాలో ఎన్నుకోనుంది. నా అభిప్రాయం ఎంటంటే.. ప్రేమించిన వ్యక్తి లేకుండా జీవించవచ్చు... కానీ ఆహారం లేకుండా బతకలేం కదా. మరి నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో ఊహించు’’ అని సమాధానం ఇచ్చాడు.
(చదవండి: టేస్ట్‌ అదరహో.. మటన్‌ లందు కర్నూలు మటన్‌ వేరయా !)

ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, కౌన్సిలర్‌ ఇచ్చిన సమాధానం అన్ని ఓ పేపర్‌లో వచ్చాయి. ఈ క్లిప్పింగ్‌ని పరణ్‌జాయ్‌ అనే జర్నలిస్ట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. మనిషి తాత్కాలికం.. మాంసం శాశ్వతం.. అనుమానమే లేదు.. మటన్‌నే ఎంచుకుంటుంది.. ఫన్నీగా అనిపిస్తున్నా ఇది చాలా సీరియస్‌ విషయం అని నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?

మరిన్ని వార్తలు