తెలంగాణ వర్షాలపై స్పందించిన యూవీ

15 Oct, 2020 16:42 IST|Sakshi

హైదరాబాద్‌ : గత నాలుగు రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా భాగ్యనగరంలో ఎడతెరిపినివ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్‌ బలగాలు శ్రమిస్తున్నాయి. తెలంగాణ భారీ వర్షాల నుంచి బయటపడాలని చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ట్విటర్‌లో స్పందించాడు.(చదవండి : భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ)

'తెలంగాణలో భారీ వర్షాలు త్వరలో తగ్గిపోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. దేవుని దయ వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. అత్యవసర విభాగానికి చెందిన కార్మికులు వరద నీటిలో తమ విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇదే నా సెల్యూట్‌. ఎంత కష్టం వచ్చినా బాధిత ప్రాంతాల ప్రజలకు  ఉపశమనం కలిగించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా.' అంటూ తెలిపాడు. (చదవండి : భారీ వర్షాలు.. పానీపూరి తినడానికి వెళ్లి!)

మరిన్ని వార్తలు