బాలాకోట్‌ ఆపరేషన్‌: లాంగ్‌ రేంజ్‌ స్టైక్‌

28 Feb, 2021 08:08 IST|Sakshi

ఢిల్లీ: ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్‌ ఆపరేషన్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన ఫైటర్‌ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్‌ఓసీ) దాటి, పాకిస్తాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్‌ ఆపరేషన్‌ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్‌ రేంజ్‌ స్ట్రైక్‌ నిర్వహించింది. ప్రాక్టీస్‌ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. బాలాకోట్‌ ఆపరేషన్‌ చేపట్టిన స్క్వాడ్రన్‌ బృందమే ఈ లాంగ్‌ రేంజ్‌ స్ట్రైక్‌లో పాల్గొనడం విశేషం.
చదవండి: బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌‌: ‘కోతి ఖతమైంది’

మరిన్ని వార్తలు