రఫేల్‌ జెట్స్‌తో ప్రత్యర్ధులకు చుక్కలు

5 Oct, 2020 15:39 IST|Sakshi

వైమానిక దళం చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదూరియా

సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆయుధ శ్రేణిలో రఫేల్‌ యుద్ధ విమానాలు చేరడంతో ప్రత్యర్ధులపై మనం పైచేయి సాధించామని, తొలిసారిగా ప్రభావవంతంగా దాడిచేసే సామర్థ్యం అందివచ్చిందని వైమానిక దళం చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదూరియా అన్నారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు సిద్థమని ఆయన స్ప్టష్టం చేశారు. లడఖ్‌లో చైనా దూకుడును ఈ ఏడాది మేలోనే తాము గుర్తించామని, అప్పటినుంచి మన సైనం, వైమానిక దళం వేగంగా స్పందిస్తున్నాయని భదూరియా పేర్కొన్నారు. చదవండి : రఫేల్‌ రాక.. చైనాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌

సరిహద్దుల్లో పాకిస్తాన్‌, చైనా సేనలు మోహరించి విస్తృతంగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయని చెప్పారు. పలు అంశాల్లో పాకిస్తాన్‌ చైనాపై ఆధారపడుతోందని చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తే భారత్‌పై చైనా పైచేయి సాధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడఖ్‌ సహా కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించిందని, పాక్‌-చైనాలతో తలపడేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు భారీగా సేనలను మోహరించామని వెల్లడించారు. కాగా ఐదు రాఫేల్‌ యుద్ధవిమానాలు సెప్టెంబర్‌ 10న భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు