ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం

16 Dec, 2022 06:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ జెట్లతో సహా ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోఉన్న సుఖోయ్‌–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు