Viral: ఎయిర్‌ క్రాఫ్టుల ప్రదర్శన ఫోటోలు విడుదల చేసిన ఐఏఎఫ్‌

4 Oct, 2021 13:17 IST|Sakshi

ఘజియాబాద్: ఎయిర్ ఫోర్స్-డేను పురస్కరించుకొని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అక్టోబర్‌ 8( శుక్రవారం)న 89వ వార్షికోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ క్రాఫ్టులతో ఐఏఎఫ్‌ ఎయిర్‌ షో ప్రదర్శించనుంది. అందులో భాగంగా ఐఏఎఫ్‌ ఎయిర్‌ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ చేస్తోంది. తాజాగా ఎయిర్‌ షోకు సంబంధించిన రిహార్సల్స్‌ ఫోటోలను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పలు అత్యాధునిక ఎయిర్‌ క్రాఫ్టులను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తామని ఐఏఎఫ్‌ పేర్కొంది.శుక్రవారం ఉదయం 8గంటలకు ఏఎన్‌-32 ఎయిర్‌ క్రాఫ్టు ప్రదర్శనతో ఎయిర్‌​ షో మొదలుకానుందని తెలిపారు. తర్వాత హెరిటేజ్‌ ఎయిర్‌ క్రాఫ్టు, మోడరన్‌ ట్రాన్‌పోర్టు, ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ ఎయిర్‌ క్రాఫ్టుల ప్రదర్శన ఉంటుందని ఐఏఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.

హిందన్‌ ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌లో ఈ ప్రదర్శనలు జరుగుతాయిని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ, ఘజియాబాద్‌ ప్రాంతంలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఐఏఎఫ్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్త బయట వేయటం వల్ల పక్షలు తిరుగుతాయిని దాని వల్ల తక్కువ ఎత్తులో జరిగే ఎయిర్‌ షోకు ఇబ్బందులు కలుగుతాయిని తెలిపారు.


మరిన్ని వార్తలు