కూలిన ఐఏఎఫ్‌ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు

2 Jun, 2023 05:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్‌)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్‌ కమాండర్‌ తేజ్‌పాల్, కో పైలట్‌ భూమిక బెంగళూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సూర్యకిరణ్‌ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది.

తేజ్‌పాల్, భూమిక ప్యారాచూట్‌ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్‌పాల్‌ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన రెడ్‌బర్డ్‌ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు.

మరిన్ని వార్తలు