కలెక్టర్‌ చెంప దెబ్బ: ఐఏఎస్‌ల సంఘం సీరియస్‌!

23 May, 2021 19:27 IST|Sakshi
వీడియో దృశ్యం

రాయ్‌పూర్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలు బ్రేక్‌ చేశాడంటూ ఛత్తీస్‌ఘడ్‌లోని సురాజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, ఐఏఎస్‌ల సంఘం దీనిపై స్పందించింది. కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మ‌ దురుసు ప్రవర్తనను తప్పుబట్టింది. ‘‘ సురాజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రవర్తనను ఐఏఎస్‌ల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాని చర్య. సివిల్‌ సర్వెంట్స్‌ సానుభూతి కలిగిఉండాలి. సమాజం పట్ల అన్ని వేళలా దయ కలిగి ఉండాలి. ఇలాంటి కష్ట సమయంలో అదెంతో అవసరం’’ అని పేర్కొంది. 

కాగా, కొద్దిరోజుల క్రితం మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న కలెక్టర్ రణ్‌బీర్‌ శర్మ‌, పోలీస్‌ అధికారులు అడ్డగించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్న టైంలో కలెక్టర్‌ మొబైల్‌ ఇవ్వమన్నాడు. సెల్‌ఫోన్‌ను నేలకోసి కొట్టి.. వెంటనే ఆ వ్యక్తి చెంపచెల్లుమనిపించాడు. అంతేకాదు అక్కడున్న పోలీసులకు అతన్ని చితకబాదమని ఆదేశాలివ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు చెరోవైపు అతనిపై లాఠీ ఝుళిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్‌పై బదిలీ వేటు వేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు