ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్‌ అధికారిణి

18 Mar, 2022 10:02 IST|Sakshi
ఆస్పత్రి వైద్యులతో జెడ్పీ సీఈవో నందిని 

సాక్షి, బళ్లారి(కర్ణాటక): సాధారణ, మధ్య తరగతి మహిళలే ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో ఒక ఐఏఎస్‌ అధికారిణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుందనే విషయాన్ని చాటిచెప్పారు. కర్ణాటకలో బళ్లారి జిల్లా పరిషత్‌ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎ.నందిని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నెలవారీ చికిత్సలు పొందారు.

చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే

ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సహజ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఐఏఎస్‌ అధికారులతో పాటు సామాన్యులకు కూడా ఇదే రకమైన వైద్యం అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జి డా.బసిరెడ్డి తెలిపారు. గతంలో బళ్లారి కలెక్టర్‌ నకుల్‌ సతీమణికి, అలాగే జెడ్పీ సీఈవో రాజేంద్ర సతీమణికి కూడా ఇక్కడే ప్రసవాలు చేశామని చెప్పారు

మరిన్ని వార్తలు