ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: ఐఏఎస్‌ అధికారి

19 Jun, 2021 10:46 IST|Sakshi
పోలీస్‌ ప్రోటెక్షన్‌ కోరిన ఐఏఎస్‌ అధికారి లోకేశ్‌ కుమార్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు

నాకు, నా కుటుంబానికి ప్రాణాహాని ఉంది.. పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వండి: ఐఏఎస్‌ అధికారి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్‌ అధికారి ఒకరు తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. పోలీసు ప్రొటేక్షన్‌ కల్సించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సదరు ఐఏఎస్‌ అధికారి సిగ్నల్‌ యాప్‌ మెసేజింగ్‌ గ్రూప్‌లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో సదరు ఐఏఎస్‌ అధికారికి బెదిరంపు కాల్స్‌ వస్తున్నాయట. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి పోలీస్‌ ప్రోటెక్షన్‌ కల్సించాల్సిందిగా కోరుతున్నాడు. 

ఆ వివరాలు.. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి లోకేశ్‌ కుమార్‌ జంగిడ్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ కుమార్‌ ఓ మేసేజింగ్‌ గ్రూప్‌లో కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త లీక్‌ అవ్వడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణారహిత్య చర్యలుగా పేర్కొంటూ.. వారం లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఓ కొత్త నంబర్‌నుంచి తనకు కాల్‌ వచ్చిందని.. ఫోన్‌లో సదరు వ్యక్తి తనను మీడియాతో మాట్లాడటం మానేయాలని.. ఆరు నెలల పాటు లీవ్‌ మీద వెళ్లాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు లోకేశ్‌ కుమార్‌ తెలిపాడు. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని.. పోలీస్‌ ప్రోటెక్షన్‌ కల్సించాల్సిందిగా కోరుతూ లోకేశ్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌ డీజీపీకి వివేక్‌ జోహ్రికి లేఖ రాశారు‌. భోపాల్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

ఇక వ్యక్తిగత కారణాలను చూపుతూ లోకేశ్‌ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తనను డిప్యూటేషన్‌ మీద పంపించాల్సిందిగా కోరాడు. ఇక లీకైన చాట్‌లో లోకేశ్‌ తాను అవినీతిని ఏమాత్రం సహించలేనని.. అందుకే తనను తరచుగా బదిలీ చేస్తారని తెలిపారు. నాలుగేళ్ల తన సర్వీసులో ఇప్పటికే తనను 9సార్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారని తెలిపాడు. 

చదవండి: ఐఏఎస్‌ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా

మరిన్ని వార్తలు