రిపోర్టర్‌పై దౌర్జన్యం.. తరిమి కొట్టిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

11 Jul, 2021 10:07 IST|Sakshi

UP Block Panchayat Chief Elections స్థానిక సంస్థల ఎన్నికలు దాడుల పర్వంగా మారిపోయాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో వరుస దాడుల ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఎలక్షన్‌ విధుల్లో ఉన్న ఓ పోలీస్‌ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.. మరో ఘటనలో ఐఏఎస్‌ అధికారి ఓ టీవీ రిపోర్ట్‌ను వెంటపడి మరీ బాదాడు. ఆ ఘటనా వీడియో సర్క్యూలేట్‌ అవుతోంది. 

లక్నో:  మియాగంజ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్‌ ఛీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్‌.. ఓ టీవీ రిప్టోరన్‌ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్‌ఫోన్‌తో షూట్‌ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు.

ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్‌ కౌన్సిల్‌ సభ్యులను కొందరిని కిడ్నాప్‌ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ  ఆరోపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఘటనపై స్పందించేందుకు దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్‌ కలెక్టర్‌ స్పందించారు. జర్నలిస్ట్‌తో మాట్లాడానని, అతని నుంచి ఫిర్యాదును స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని ఉన్నావ్‌ జిల్లా మెజిస్రే‍్టట్‌ రవీంద్ర కుమార్‌ హామీ ఇచ్చారు. కాగా, యూపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా, మిత్రపక్షాలతో కలిసి 635 పంచాయితీ చీఫ్‌ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ విజయాన్ని ‘చరిత్రాత్మక విజయం’గా అభివర్ణించుకుంటోంది.

మరిన్ని వార్తలు