IBPS PO Recruitment 2022: 6,432 పీఓ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం..

15 Aug, 2022 15:17 IST|Sakshi

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువులు

మూడంచెల ప్రక్రియతో ఎంపిక

కొలువు సొంతమైతే సీజీఎం, ఆపై స్థాయికి చేరే అవకాశం

ఐబీపీఎస్‌ సీఆర్‌పీ పీఓ/ఎంటీ–2023–24 ప్రక్రియ రంభం

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారా.. బ్యాంకు కొలువులో చేరాలనుకుంటున్నారా.. అయితే.. మీకు ఓ చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! ఏడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) హోదాలో.. అడుగుపెట్టే అవకాశం మీ ముంగిట నిలిచింది! అదే.. ఐబీపీఎస్‌.. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ నోటిఫికేషన్‌. సంక్షిప్తంగా ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ పీఓ/ఎంటీ!! మూడు దశల్లో ఉండే ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు! 2023–24 సంవత్సరానికి ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ పీఓ/ఎంటీ నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. 

దేశంలో ఎస్‌బీఐ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువుల భర్తీ కోసం ఏర్పాటైన సంస్థ.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌). ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌.. పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌లు విడుదల చేస్తోంది. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్‌పీ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ పీఓ / ఎంటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏడు బ్యాంకులు.. 6,432 పోస్ట్‌లు
►ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ పీఓ/ఎంటీ (12)–2023–24 ద్వారా మొత్తం ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,432 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 535, కెనరా బ్యాంక్‌ 2500, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 500, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ 253, యూకో బ్యాంక్‌ 550, యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2094. 
►వీటితోపాటు.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే నాటికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌ల నుంచి కూడా ఇండెంట్‌ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.

అర్హతలు
►ఆగస్ట్‌ 22, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
►వయోపరిమితి: ఆగస్ట్‌ 1, 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ (నాన్‌ క్రీమీ లేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 

మూడంచెల ఎంపిక ప్రక్రియ
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ/ఎంటీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఐబీపీఎస్‌ మూడంచెల విధానంలో నిర్వహిస్తుంది. అవి.. ప్రిలిమినరీ; మెయిన్‌; పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లు ఉంటాయి. ఈ ఆన్‌లైన్‌ పరీక్షల్లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ అందజేస్తారు.

ప్రిలిమినరీ రాత పరీక్ష.. ఇలా
►పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 20 నిమిషాలు. 
►ప్రతి సెక్షన్‌లోనూ ఐబీపీఎస్‌ నిర్దిష్ట కటాఫ్‌ మార్కులను నిర్ణయిస్తుంది. ఆ కటాఫ్‌ మార్కుల జాబితాలో నిలిచిన వారికి మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత లభిస్తుంది.
►ప్రిలిమినరీలో నిర్దిష్ట కటాఫ్‌ మార్కుల ఆధారంగా.. ఒక్కో ΄ోస్ట్‌కు పది మంది చొప్పున (1:10 నిష్పత్తిలో)..మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్‌ 4 విభాగాలు.. 200 మార్కులు
మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 ప్రశ్నలు–60 మార్కులు.. ఇలా మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌.. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌
మెయిన్‌ ఎగ్జామ్‌లో పేర్కొన్న ఆబ్జెక్టివ్‌ విభాగాలతోపాటు అదనంగా..ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ విభాగంలో అభ్యర్థులు ఒక ఎస్సే, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. సమయం 30 నిమిషాలు. దీని ద్వారా అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మెయిన్‌తో΄ాటే అదే రోజు ఈ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు.

నెగెటివ్‌ నిబంధన
ఆన్‌లైన్‌ విధానంలో..ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

చివరగా.. ఇంటర్వ్యూ
మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. సెక్షన్‌ వారీ కటాఫ్,ఓవరాల్‌ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు సాధించాలి. ఈ అర్హత మార్కులు ΄÷ందిన వారినే ఇంటర్వ్యూ మెరిట్‌ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలను.. ΄ోస్ట్‌లు భర్తీ చేస్తున్న బ్యాంకులు లేదా ఏదైనా ఒక బ్యాంక్‌ నోడల్‌ బ్యాంక్‌గా వ్యవహరించి వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

80:20 వెయిటేజీ విధానం
అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు. మెయిన్‌కు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. మొత్తం వంద మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఆయా బ్యాంకుల్లో 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల్లో నియమిస్తారు. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు తేదీలు: 
ఆగస్ట్‌ 2 – ఆగస్ట్‌ 22,2022
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (ఆన్‌లైన్‌): అక్టోబర్‌లో 
మెయిన్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ : నవంబర్‌లో
పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2023 జనవరి/ఫిబ్రవరి నెలల్లో
ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌: 2023 ఏప్రిల్‌ నెలలో
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in

మరిన్ని వార్తలు