Corona Virus: గర్భిణిలపై కరోనా అధిక ప్రభావం   

17 Sep, 2021 07:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్‌ సోకితే ఎన్నో రకాల ఇతర వ్యాధులు కూడా వారిలో విజృంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. దాని ప్రకారం కరోనా సోకిన గర్భిణుల్లో తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, హైపర్‌ టెన్షన్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోవిడ్‌–19తో మహిళలు ప్రసవిస్తే వారిలో ఎనీమియా, డయాబెటీస్‌ వంటివి పెరిగిపోయి తల్లుల మరణానికి దారి తీసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు