డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు చెక్‌.. ఐసీఎంఆర్‌ శుభవార్త

9 Jul, 2022 07:35 IST|Sakshi

పుదుచ్చేరి: డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్‌లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్‌ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్‌ కంట్రోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌(వీసీఆర్‌సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్‌లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి.

వీటిల్లో వైరస్‌లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్‌ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్‌ కంట్రోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌(వీసీఆర్‌సీ–పుదుచ్చేరి) డైరెక్టర్‌ డాక్టర్‌ అశ్వనీ కుమార్‌ చెప్పారు.  
చదవండి: దేశంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. 

మరిన్ని వార్తలు