బ్యాగులో బాంబు కలకలం.. పోలీసులు అలర్ట్‌

17 Feb, 2022 19:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. సీమపురిలో ఓ ఇంట్లోని బ్యాగులో పేలుడు పదార్ధం ఐఈడీని పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. ఘాజిపూర్‌ పూల మార్కెట్‌ కేసు విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగు కనిపించింది. వెంటనే బ్యాగును తెరిచి చూడటంతో బాంబు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. సమాచారం అందుకున్న బాంబ్‌ స్వ్కాడ్‌, ఎన్‌ఎస్‌జీ బృందం, స్పెషల్‌ సెల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో పూల మార్కెట్‌లో 3 కేజీల ఆర్డీఎక్స్‌ను పోలీసులు గుర్తించారు.


 

మరిన్ని వార్తలు