వైల్డ్‌ను వైల్డ్‌గానే ఉంచాలి.. చీకట్లో బంధించే హక్కు ఎవడిచ్చాడసలు?

10 Oct, 2022 10:00 IST|Sakshi

వైరల్‌: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్‌ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్‌ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్‌ లైట్‌ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో..

అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్‌ఫెక్ట్‌ క్యాప్చర్‌ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌) అధికారి సుశాంత్‌ నంద ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. 

ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్‌ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు