ఐజీసీఏఆర్, కల్పకంలో 337 ఖాళీలు

20 Apr, 2021 15:59 IST|Sakshi

కల్పకం(తమిళనాడు)లోని భారత ప్రభు త్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌(ఐజీసీఏఆర్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 337(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–98, స్టైపెండరీ ట్రెయినీ–239)

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌
► పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్, వర్క్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌(స్టెనోగ్రఫీ, ఫిజికల్‌ టెస్ట్, డ్రైవింగ్‌), అడ్వాన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
స్టైపెండరీ ట్రెయినీ

►స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–1: 68(కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌)
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–2: 171

► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్‌(మెకానికల్‌),ఫిట్టర్‌/రిగ్గర్, ప్లంబర్, వెల్డర్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు. » అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి.

► ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 14.05.2021
► వెబ్‌సైట్‌: www.igcar.gov.in

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌: జూనియర్‌ అసిస్టెంట్‌ కొలువులు

UPSC CAPF: అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు

మరిన్ని వార్తలు