ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

8 Nov, 2021 18:26 IST|Sakshi

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 15

► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు–05, జూనియర్‌ టెక్నీషియన్‌లు–08.

► ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.27,500 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ అర్హత సాధించి ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.21,500 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

► జూనియర్‌ టెక్నీషియన్‌లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు  రూ.16,000 నుంచి రూ.38,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్, చెన్నై–600036 చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 14.11.2021

► వెబ్‌సైట్‌: https://icandsr.iitm.ac.in

మరిన్ని వార్తలు