Rain Alert: ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటన!

30 Dec, 2021 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు ​కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు వర్షపాతం ఉంటుంది. తర్వాత ఐదు రోజులలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఐతే ఈశాన్య భారతదేశంలో రెండు రోజులపాటు పొడిగా ఉంటుంది.

చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్‌ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..

ఉత్తర భారతంలో మాత్రం జనవరి 5 నుంచి 7 మధ్య చలిగాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో పగటిపూట, అర్థరాత్రి సమయాల్లో దట్టంగా మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 5 నుండి 7 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో జనవరి 6, 7 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 2,3 రోజుల్లో చలిగాలుల కారణంగా పంజాబ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెల్పింది.

చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!

మరిన్ని వార్తలు