ఈ ఏడాది వేసవి బాధించదు: ఐఎండీ

2 Mar, 2022 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవి అంతగా బాధించే అవకాశాల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతంలో గరిష్ట స్థాయి ఉష్ట్రోగతలు తక్కువగానే నమోదవుతాయని మంగళవారం వెల్లడించింది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో మార్చి నుంచి మే వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయని తెలిపింది.

తూర్పు, ఈశాన్య, ఉత్తర భారతం, గంగా నది మైదాన ప్రాంతాల్లో వడ గాడ్పులు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రో చెప్పారు. పశ్చిమ, వాయవ్య భారతాన్ని  ఈ వేసవిలో వడగాడ్పులు బాధిస్తాయని,  కానీ ఉత్తర భారతంలో అంతగా ఉండవని తెలిపారు.    

మరిన్ని వార్తలు