ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకో టీవీ‌ ఛానల్‌

15 Apr, 2021 01:53 IST|Sakshi

డిజిటల్‌ బాటలో కాంగ్రెస్‌ పార్టీ

24న ఐఎన్‌సీ టీవీ చానెల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్‌ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్‌ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్‌ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు.

చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్‌

మరిన్ని వార్తలు