గృహ కొనుగోలుదారులకు శుభవార్త!

1 Feb, 2021 18:26 IST|Sakshi

న్యూఢిల్లీ: గృహా కొనుగోలుదారులకు శుభవార్త అందించింది కేంద్రం. మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లో గృహాల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది 2022 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు ఈ రాయితీ వర్తించనుంది. మొదటిసారి రూ.45 లక్షల లోపు ఇళ్లు కొనేవారికి అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు సరసమైన ధరలో ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తికి 3.5 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో దేశంలోని 7-8 ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు 40-50 శాతం తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్స్, డేటా అనలిటిక్ సంస్థలు వెల్లడించాయి. (చదవండి: ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు)

>
మరిన్ని వార్తలు