ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. అప్‌డేట్స్‌

15 Aug, 2022 11:13 IST|Sakshi

Independence Day celebrations ఢిల్లీ అప్‌డేట్స్‌

వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ

►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి

►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి

►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి

►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి

►5. ‍ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి

మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోంది

జై జైవాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌

ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్‌ లక్ష్యం

డిజిటల్‌ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి

వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి.

సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది.

ఈ  75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం.  ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు.

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది.

స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి.

► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి.

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ

► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు.

► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు.

► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ


► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు.

► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి.

75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్‌. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు