భారత్‌: కరోనా కేసుల కంటే డిశ్చార్జ్‌లే ఎక్కువ

25 Oct, 2020 10:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154గా ఉంది. అయితే గత 22 రోజులుగా నమోదవుతున్న కేసుల కంటే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అవుతున్న వారిసంఖ్య అధికంగా ఉండటం విశేషం.
(చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: డబ్ల్యూహెచ్‌వో)

మరిన్ని వార్తలు