ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ

6 Sep, 2021 19:40 IST|Sakshi

మనదేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో 1.25 కోట్ల కోవిడ్ డోసులు వేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేసే ఈ కోవిడ్ డోసులు సంఖ్య అనేక దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువగా అని నొక్కి చెప్పారు. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును అర్హులైన అందరికీ అందించిన రాష్టంగా నిలిచిన హిమచల్‌ప్రదేశ్‌ ప్రజలతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న మోదీ.. దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో "దవాయ్ భీ, కరాయ్ భీ(టీకాలు వేయండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించండి)" అనే మంత్రాన్ని మనం మరచిపోకూడదని మోదీ అన్నారు.(చదవండి: ప్రపంచ దేశాధినేతల్లో టాపర్‌గా ప్రధాని మోదీ)

లాజిస్టిక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదును ఇచ్చిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ "ఛాంపియన్"గా మారిందని అన్నారు. అలాగే, ఆ రాష్ట్రంలో 30 శాతం మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు మోడీ అన్నారు. సీక్కిం, దాద్రా, నాగర్ హావేలీ కూడా ఈ లక్ష్యాన్ని సాధించాయని, అనేక ఇతర రాష్ట్రాలు దీనిని సమీపిస్తున్నాయని మోదీ చెప్పారు.

హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి, ఎలాంటి వృధా లేకుండా వ్యాక్సినేషన్ వేగంగా వేసేలా చూడటం రాష్ట్రానికి "పెద్ద విజయం" అని అన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులతో సహా "కోవిడ్ యోధులు" చేసిన "అలుపెరగని కృషి"ని మోదీ ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల భాగస్వామ్యం, బహిరంగ చర్చల ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయ్యిందని అన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు