వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భార‌త్ ఎందుకు వ్య‌తిరేకిస్తోంది?

5 Jun, 2021 16:06 IST|Sakshi

న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్ర‌క్రియ‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ద‌న్ వ్య‌తిరేకించారు. మ‌రికొద్దిరోజుల్లో జీ7 స‌మ్మిట్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో జీ 7 స‌మ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్య‌శాఖ మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది.ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు హ‌ర్ష వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వ‌డం దేశాల‌ప‌ట్ల వివ‌క్ష‌త చూపిన‌ట్లే అవుతుంద‌న్నారు.  

దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా ఉండ‌డం, సంబంధిత సమస్యలను ప‌రిష్క‌రించడం, వ్యాక్సినేష‌న్‌, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీల‌పై దృష్టిసారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హ‌ర్షవ‌ర్ద‌న్ అన్నారు.ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమ‌లు అంటే దేశాల ప‌ట్ల వివ‌క్ష‌త చూపిన‌ట్లేన‌ని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు ప్ర‌తికూలంగా ఉంటుందనే విష‌యాన్ని భార‌త్ స్ప‌ష్టం చేస్తోంద‌ని చెప్పారు. 

వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే 
కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఆయా దేశాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే వారు త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ క‌లిగి ఉండాలి. ఎవ‌రైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివ‌రాల్ని అధికారిక  పాస్ పోర్ట్ వెబ్ సైట్ల‌లో న‌మోదు చేసుకోవాలి.  అలా ఎవ‌రైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో న‌మోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల  పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో స‌ర్టిఫికెట్స్ ను అందిస్తారు. ఈ స‌ర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు భార‌త్ వ్య‌తిరేకిస్తుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేష‌న్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవ‌రి ద‌గ్గ‌ర ఈ వ్యాక్సిన్  పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్ర‌మే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెస‌లు బాటు క‌ల్పించింది. ఇజ్రాయెల్ బాట‌లో మ‌రికొన్నిదేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి.      

చ‌ద‌వండి : లాక్‌డౌన్‌ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు

మరిన్ని వార్తలు