Afghanistan: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన కేంద్రం!

17 Aug, 2021 18:15 IST|Sakshi

తాలిబాన్లు అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ ఉన్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితిల వల్ల భారతదేశంలోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి భారతదేశం కొత్త కేటగిరీ ఈ-వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు కేవలం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.‎ వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో భారతదేశం"ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" అనే కొత్త కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్రింద తెలుసుకోండి. 

ఈ-వీసా దరఖాస్తు విధానం

  • indianvisaonline.gov.in/evisa/Registration మీద క్లిక్ చేయండి
  • ఇప్పుడు Apply here for e-visa క్లిక్ చేసిన తర్వాత, తప్పకుండా నేషనాలిటీ అఫ్గనిస్తాన్‌ ఎంచుకోండి.
  • ఆ తర్వాత Passport Type, Port Of Arrival, Date of Birth, Email ID, Expected Date of Arrival వివరాలు సమర్పించండి.
  • ఇప్పుడు వీసా కేటగిరీలో "ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" ఎంచుకోండి.
  • ఆ తర్వాత క్యాప్చా నమోదు చేసి రిఫరెన్స్ కొరకు స్క్రీన్ షాట్ తీసుకోని continue మీద క్లిక్ చేయండి.
  • ప్రాథమిక వివరాలను పూర్తి చేసిన తర్వాత పేజీలో దరఖాస్తుదారుల వివరాల కొరకు ఫారం ఉంటుంది.
  • ప్రతి అప్లికేషన్ కోసం భారతదేశంలో ఉన్న రిఫరెన్స్ వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా మరియు అఫ్గనిస్తాన్‌లో ఉన్న ఒక రిఫరెన్స్ వ్యక్తి అవసరం అవుతుంది.
  • ఈ వీసాకు దరఖాస్తు ఫీజు లేదు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారి కోసం ఎంఈఏ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఇతర అభ్యర్థనల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ సెల్ ఏర్పాటు చేసి౦ది. ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి హెల్ప్ లైన్ నంబర్-919717785379, ఈ-మెయిల్- MEAHelpdeskIndia@gmail.com ట్విట్టర్ లో ప్రకటించారు.

మరిన్ని వార్తలు