దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు..

9 Nov, 2020 10:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతుంది. గడచిన 24 గంటలలో 45,903 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,53,657కి చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 490 మంది  మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,26,611కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 48,405 ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌కి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 79,17,373గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,09,673 ఉన్నాయి. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.56 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.96  శాతంగా ఉండగా.. మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది. (చదవండి: వారికే కరోనా ముప్పు ఎక్కువట)


 

మరిన్ని వార్తలు