కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల.. 22 మరణాల్లో 20 కేరళ నుంచే!

7 May, 2022 12:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపించింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,805 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  కరోనాతో 22 మంది మరణించారు. ఇందులో 20 మరణాలు కేరళ నుంచి ఉండడం గమనార్హం.  ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 20,303గా ఉంది. 

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,168 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో ఇప్పటి వరకు  5,24,024 మంది మృతి చెందారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 4, 30, 98, 743 మంది కరోనా బారినపడ్డారు.

భారత్‌లో ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌ రేటు ఆధారంగా.. యాక్టివ్‌ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం. డెయిలీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉండగా, వారంతపు పాజిటివిటీ రేటు 0.79 శాతంగా నమోదు అవుతోంది. 

గడిచిన 24 గంటల్లో.. ఢిల్లీలో గరిష్ఠంగా 1, 656 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత ఇదే హయ్యెస్ట్‌ మార్క్‌. పాజిటివిటీ రేటు 5.39 శాతంగా ఉంది. 

ముంబైలో 117 కొవిడ్‌-19 కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగవరోజూ కేసులు 100కి పైగా నమోదు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు