రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు

9 Aug, 2020 10:17 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : దేశంలో క‌రోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్త‌గా 64,399 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21,53,011కు చెరింది. ఇందులో 6,28,747 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 14,80,885 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 861 మంది మ‌ర‌ణించారు.

దీంతో క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 43,379కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో కోలుకున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 68.3 శాతంగా ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించింది. కాగా వ‌రుస‌గా ఎనిమిది రోజుల‌పాటు ప్ర‌తిరోజు 54 వేల చొప్పున కేసులు న‌మోద‌వ్వగా, గ‌త మూడు రోజులుగా 62 వేల‌కు పైగా వ‌స్తున్నాయి. తాజాగా ఆదివారం రికార్డుస్థాయిలో 64 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.(తెలంగాణలో 79వేలు దాటిన కరోనా కేసులు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు