తగ్గుతున్న కరోనా ప్రభావం

2 Nov, 2020 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల ఉండటమే దీనికి తార్కాణం.కొత్త కేసులు రోజుకు 50 వేలలోపే నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 46,963 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

అదే సమయంలో 470 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,111కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 74,91,513 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,70,458  గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 6.97 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91.54 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. ఇప్పటి వరకూ 10,98,87,303  కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం మరో 10,91,239 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.  

మరిన్ని వార్తలు