భారత్: 16 లక్షలు దాటిన కరోనా కేసులు

31 Jul, 2020 09:30 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు. (కరోనాతో ఆ కుక్క చనిపోయింది..)

ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 5,45,318 మంది చికిత్స పొందుతుండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,88,32,970 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ప్రకటించింది. (దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ కష్టం)

మరిన్ని వార్తలు