వ్యాక్సిన్స్‌ @ 46 కోట్ల డోసులు

1 Aug, 2021 04:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 46  కోట్ల మైలురాయి దాటింది. 54,94,423 శిబిరాల ద్వారా మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ పూర్తయినట్టు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,81,263 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 37,291 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 97.37% అయింది. కాగా గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 41,649 కొత్త కేసులు నమోదయ్యాయి. 34 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,920 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు