అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు

1 Jul, 2021 11:40 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ ప్రయాణికుల వివనాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. అయితే, కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రద్దును జూలై 31వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) బుధవారం వెల్లడించారు. అయితే, ఎంపిక చేసిన వర్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్డ్‌ విమానాల రాకపోకలను అనుమతించనున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ కార్గో విమానాల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికుల వివన సేవలను ప్రభుత్వం 2020 మార్చి నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్‌ మిషన్‌ కింద 2020 మే నుంచి ప్రత్యేక అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను అనుమతిస్తోంది. 

చదవండి: పిల్లలపై కోవోవాక్స్ క్లినికల్‌ ట్రయల్స్‌కు నో

మరిన్ని వార్తలు