దేశంలోనే మొదటి ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు

16 Jan, 2021 13:43 IST|Sakshi

చండీగఢ్‌: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చండీగఢ్‌ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్‌ నుంచి హిసార్‌ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్‌ నుంచి డెహ్రాడూన్‌ వరకు మరో ఎయిర్‌ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.

మూడో దశలో చండీగఢ్‌ నుంచి డెహ్రాడూన్, హిసార్‌ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్‌ ట్యాక్సీ కోసం టెక్నామ్‌ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్‌ నగరాలను ఎయిర్‌ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.  

చదవండి:
ట్రాఫిక్‌ జామ్‌.. నెలకు రూ.2లక్షల ఆదాయం

‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’

మరిన్ని వార్తలు