పదేళ్లలో సరిపడా వైద్యులు

16 Apr, 2022 06:29 IST|Sakshi

కేంద్ర విధానాలతో వైద్య రంగంలో సమూల మార్పులు: మోదీ  

భుజ్‌ (గుజరాత్‌): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌లో 200 పడకల కె.కె.పటేల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

‘‘జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు వచ్చే పదేళ్లలో అత్యధికంగా వైద్యులు అందుబాటులోకి వస్తారు’’ అని ఈ సందర్భంగా చెప్పారు.  కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సంక్షోభం సమయం లో భారత ఆయుర్వేదం, యోగాపై ప్రపంచ దేశాలు బాగా దృష్టి సారించాయన్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్‌లోని మార్బిలో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ ఆవిష్కరించనున్నారు.

మరిన్ని వార్తలు