94 యూట్యూబ్‌ చానళ్లపై నిషేధం

22 Jul, 2022 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: 2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్‌కు సంబంధించి వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ కోవిడ్‌కు సంబంధించిన, చర్యలు తీసుకోదగ్గ 34,125 ప్రశ్నలకు స్పందించిందన్నారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు