నేపాల్‌తో గట్టి బంధం: మోదీ

16 May, 2022 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ : నేపాల్‌తో భారత్‌ సంబంధాలు అసమానమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ప్రధాని సోమవారం నేపాల్‌లో లుంబినికి వెళ్లనున్నారు. తన పర్యటన గురించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేపాలీ ప్రధాని షేర్‌ బహదూర్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. గత నెలలో షేర్‌ బహదూర్‌ భారత్‌ వచ్చినప్పుడు ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయని మోదీ పేర్కొన్నారు.  
చదవండి: ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్‌ 

మరిన్ని వార్తలు