రెండు రోజుల్లో మోడెర్నా టీకాల రాక!

4 Jul, 2021 03:42 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ‘మోడెర్నా’ అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి బ్యాచ్‌ టీకాలు మన దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మోడెర్నా టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇప్పటికే లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రారంభించిన కోవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా మోడెర్నా టీకాలు భారత్‌కు అందనున్నాయి.  భారత్‌లో డీసీజీఐ నుంచి అనుమతి లభించిన నాలుగో టీకా ఇదే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు