ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్

4 Mar, 2021 20:37 IST|Sakshi

ఇండియా పోస్ట్ బ్యాంకు ఖాతాదారులకు పోస్టల్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడంపై ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. నగదు లావాదేవీలపై విధించే ఛార్జీలు వివిధ ఖాతాల ప్రకారం మారనున్నట్లు తెలుస్తుంది. ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎటువంటి చార్జీలు లేవు. అంతకన్నా ఎక్కువ సార్లు నగదు తీసిన మొత్తంలో 0.50శాతం(కనీసం రూ.25) వసూలు చేయబడుతుంది.

మీకు పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా ఉంటే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ప్రతి నెలా రూ.25 వేలు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆ తరువాత ప్రతి ఉపసంహరించబడిన మొత్తంలో కనీసం రూ.25 లేదా 0.50 శాతం వసూలు చేయబడుతుంది. మీరు నెలలో 10,000 రూపాయల వరకు నగదు డిపాజిట్ చేస్తే అప్పుడు ఎటువంటి ఛార్జీ ఉండదు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రతి డిపాజిట్‌పై కనీసం రూ.25 వసూలు చేస్తారు. పోస్టు పేమెంట్‌ నెట్‌వర్క్‌లో లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించుకోవచ్చు. దీంతో పాటు పోస్టాఫీసుల్లో మినీ స్టేట్ మెంట్ తీసుకుంటే రూ.5 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి:

ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు

అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

మరిన్ని వార్తలు