కరోనా: భారత్‌లో 12,286 కొత్త కేసులు

2 Mar, 2021 13:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 12,286  కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ల నుంచే అత్యధిక శాతం కేసులున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరుకుందని ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 91 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,248కు చేరుకుందని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,07,98,921కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.07 శాతానికి చేరింది.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,68,358గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.51  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 21,76,18,057 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం 7,59,283 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రాలను కేంద్ర అధికారులు సంప్రదించి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

చదవండి:
మార్చి 1న ఢిల్లీలో కోవిడ్‌ కలకలం.. సరిగ్గా ఏడాది 

వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఇలా చేసుకోండి

మరిన్ని వార్తలు