తాజాగా లక్షా 34 వేల కేసులు, 2,887 మరణాలు

3 Jun, 2021 10:09 IST|Sakshi

రెండు రోజులుగా పెరుగుతున్న కేసులు

తగ్గిన మరణాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్‌ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది.

తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారు 2,11,499 మంది. వీరితో కలిపి ఇప్పటివరకు 2,63,90,584 కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,13,413. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారు 3,37,989మంది. టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పొందిన వారు 24,26,265 మంది. మరణాల రేట్‌ 1.18 శాతం ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 6.34. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు  92.48 శాతంగా ఉంది.

చదవండి: నిన్న తగ్గి నేడు పెరిగి.. కొనసాగుతున్న విజృంభణ

మరిన్ని వార్తలు