భారత్‌లో కొత్తగా 18,599 మందికి కరోనా

8 Mar, 2021 11:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,853కు పెరిగింది. భారత్‌లో యాక్టివ్‌ కేసులు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో  ఇప్పటివరకు 1,08,82,798 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 1,88,747మంది చికిత్ప పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

చదవండి : (200 మందికి పాజిటివ్‌; 18 మందికి యూకే స్ట్రెయిన్‌)
(భయం లేకే కోవిడ్‌ వ్యాప్తి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు