Covid 19: శుభ పరిణామం.. 200 రోజుల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో..

28 Sep, 2021 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దేశంలో 200 రోజుల తరువాత తొలిసారి(మార్చి 11 తర్వాత ) 19 వేలకు దిగువగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,795 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. సోమవారం మహమ్మారితో 179 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 26,030 మంది బాధితులు కోలుకున్నారు.
చదవండి: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ షురూ

దీంతో దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య3,36,97,581 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఇప్పటివరకు 4,47,373 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 2,92,206 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 29,58,002 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.81%, మరణాల రేటు 1.33%గా ఉంది. ఇప్పటివరకు 87,07,08,636 మందికి కరోనా టీకాలు వేశారు.
చదవండి: సీఎం సార్‌ రక్షించండి ప్లీజ్‌..! కదిలించిన చిన్నారి వీడియో

మరిన్ని వార్తలు