24 గంటల్లో 279 మంది మృతి

28 Dec, 2020 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వ్యాది అదుపులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 279 మంది మృద్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,02,07,871కు చేరింది. ఇప్పటి వరకు 1,47,901 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 21,131 మంది డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 97,82,669 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,77,301 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి: ఈయూలో టీకా షురూ)

యాక్టీవ్‌ కేసుల్లో అత్యధికంగా కేరళలో 65, 644 ఉండగా.. మహారాష్ట్రలో 60,347 కేసులున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 6,713 కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు