దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు

22 May, 2021 09:49 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతుంది. కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. వరుసగా ఆరవ రోజు 3 లక్షలకు దిగువన రోజువారీ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 2,57,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుకవ్రారం 4,194 మంది కోవిడ్‌తో మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు చేరింది. ఇప్పటి వరకు 2,95,525  మంది ప్రాణాలు విడిచారు.

ఈ మేరకు శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం నిన్న ఒక్క రోజు 3,57,630 మంది కరోనాను జయించగా మొత్తం 2,30,70,365 కోలుకున్నారు. ఇ‍క దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 29,23,400 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 19,33,72,819 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశంలో 87.25 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 1.12గా ఉంది.

చదవండి: Coronavirus: ‘లాంగ్‌ కోవిడ్‌..’ లైట్‌ తీస్కోవద్దు!

మరిన్ని వార్తలు