దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

15 May, 2021 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో మరోసారి కోవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,26,098 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రోజే 3,890 మంది మృతిచెందారు. కొత్తగా కరోనా నుంచి కోలుకుని 3,53,299 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. ఈ మేరకు కోవిడ్‌పై కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం.. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. మరణాల సంఖ్య 2,66,207కు పెరిగింది. మొత్తం 2,04,32,898 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. ప్రస్తుతం  36,73,802 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.04 కోట్ల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. గత 24 గంటల్లో 16,93,093 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 31,30,17,193 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు.

చదవండి: Covid-19: ఆస్పత్రిలో బెడ్స్‌ కావాలా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు